స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్‌కు అస్వస్థత
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి హాజరైన స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ అస్వస్థతకు గురయ్యారు. కొత్త వాతావరణం కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ.. 'ఆమెకు కొన్ని అలెర్జీలు ఉన్నాయి. అందువల్లే అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక శిబిరంలో ఆమెకు చికిత్స తీసుకున్నారు. కోలుకున్నాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు' అని తెలిపారు.