కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో కాసేపట్లో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. హరిహరసుతుడిని మకర జ్యోతిగా భావించి దర్శినం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమల వైపు కదులుతున్నారు. దీంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అక్కడి ప్రభుతం చర్యలు తీసుకుంది. సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం జరుగనున్నట్లు తెలుస్తోంది.