‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని హీరో విక్టరీ వెంకటేశ్ అన్నారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్ మాట్లాడారు. ‘ఆడియన్స్ ఫేస్‌లో ఆనందం చూస్తుండడం ఓ ఎమోషన్. పండగకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాం. మేం అనుకున్నట్టే మీరు విజయాన్ని అందించారు’ అని అన్నారు.