స్నానం చేస్తుండగా పేలిన గీజర్.. నవ వధువు మృతి
యూపీ, బరేలీ ప్రాంతంలోని మిర్గంజ్లో స్నానం చేస్తుండగా గీజర్ పేలడంతో నవ వధువు మృతి చెందింది. కాళ్ల పారాణి ఆరకముందే జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. పిపల్సనా అనే యువతికి ఈ నెల 22న వివాహం జరిగింది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా గీజర్ పేలడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.