కాంట్రాక్టు ఏఎన్ఎం లను రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరచి తాత్కారం చేస్తుందని వెంటనే ఏఎన్ఎంల డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.