ఏపీలో దంచికొడుతున్న భారీ వర్షాలు (వీడియో)
AP: ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా వానలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తోంది.