జనవరి 1 కాదు, ఉగాదే మనకు కొత్త సంవత్సరం: ఎమ్మెల్యే రాజా సింగ్
ఉగాదే మనకు కొత్త సంవత్సరం అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో రాబోయే తరాలకు విదేశీ కల్చర్‌ను అలవాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వేడుకలను బ్రిటీష్ పాలకులు మనపై రుద్ది వెళ్లారన్నారు. "న్యూఇయర్ అంటూ గోవాతో పాటు క్లబ్, పబ్బులకు వెళ్లడమేనా మన సంస్కృతి? జనవరి 1న మనకి కొత్త సంవత్సరం కాదు. ఉగాది మనకి కొత్త సంవత్సరం. దాన్నే మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలి." అని ఆయన పేర్కొన్నారు.