తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల రాజమల్లయ్య యూఏఈలోని ఓ కంపెనీ లాటరీలో రూ.2 కోట్లు గెలుచుకున్నాడు. రాజమల్లయ్య అబుదాబీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ప్రైజ్‌మనీలో కొంత తాను లాటరీ టిక్కెట్ కొనడానికి సాయం చేసిన తన స్నేహితులకు ఇచ్చి, మిగిలిన డబ్బును కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానని ఆయన వివరించారు. తాను 30 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ కొంటున్నానని రాజమల్లయ్య చెప్పారు.