పిట్లం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా శంకరంపేట్ శివారులో జాతీయ రహదారి-161పై జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడప్గల్ వాసి సాయి గురువారం అమ్మతో కలిసి బైక్పై శంకరంపేట్కు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. ట్రాక్టర్ను ఢీకొన్నాడు. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.