శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది. 225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్లో ఇప్పటి వరకు 123 సీట్లను ఎన్పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.