రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే హైడ్రోజన్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ డిసెంబర్‌లోనే భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనుంది. ఈ హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేకుండా నడుస్తాయి. ప్రస్తుతం హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల మేర ఈ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. తర్వాత వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తాయి.