రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తమ ఫౌండేషన్ హాస్పిటల్ ద్వారా 50 వేల మంది చిన్నారులకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్సలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే 10 వేల మంది కౌమార బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు.