‘ప్యారీ దీదీ స్కీమ్: మహిళలకు నెలకు రూ.2500’

76చూసినవారు
ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు దూకుడు పెంచింది. మహిళా సమ్మాన్‌కు పోటీగా ‘ప్యారీ దీదీ స్కీమ్’ను ప్రకటించింది. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హామీని క్యాబినేట్ తొలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. బీజేపీ తమ పథకాలను కాపీ కొడుతోందని ఆయన ఆరోపించారు.