దేవర సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. టికెట్ ధరలను 14 రోజులు పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ పిటిషనర్ పిల్ వేశారు. 10 రోజులు మాత్రమే అనుమతి ఉండగా.. 14 రోజులకు ధరలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది.