చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. పసిఫిక్ సముద్రంలోని లక్ష్యాన్ని ఇది ఛేదించినట్లు పేర్కొంది. అయితే పసిఫిక్ సముద్రంలో ఆ మిసైల్ ప్రయాణించిన మార్గాన్ని మాత్రం చైనా రక్షణ మంత్రిత్వశాఖగ్ బహిర్గతం చేయలేదు. ఇటీవల కాలంలో బీజింగ్ అణ్వాయుధాల సంఖ్యను గణనీయంగా పెంచుకొంటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో తాజా పరీక్ష ఆందోళనకరంగా మారింది.