కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారు. ఇక్కడ 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.