ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గంగ, యుమున, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం గంగా హారతిలో పాల్గొన్నారు. గత ఆరు రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవంలో ఇంత వరకూ 7.3 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.