పురాణాల్లో రాఖీ పౌర్ణమి విశిష్టత తెలిపే అనేక కథలున్నాయి. ఇక రాఖీ కేవలం అన్నాచెల్లెళ్ల మధ్యనే కాదు, భార్యాభర్తల నడుమ కూడా ఉన్న రక్ష అని శచీదేవి ఇంద్రుల కథ వివరిస్తుంది. ఓసారి దేవతలు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుడికి అతని భార్య శచీదేవి రక్ష కట్టింది. దాని ప్రభావంతోనే ఇంద్రుడు గెలిచాడని పురాణాలు చెబుతున్నాయి. మనస్ఫూర్తిగా వారి విజయం కోరుకొని ఎవరికైనా రక్షను కట్టొచ్చని పండితులు చెబుతున్నారు.