రైతులకు తీపికబురు.. రూ.50 వేల లోపు!
AP: రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాలకు వర్షాలు, వరదలు ముంచెత్తగా.. అక్కడ రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. అల్లూరి, విజయనగరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు 20 తర్వాత వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేస్తారు. రూ.50 వేల లోపు రుణాలపై స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు మినహాయించనుంది.