తిరుమల కొండపై BRS మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ప్రశాంతతను దెబ్బతీసేలా తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. శ్రీవారి పవిత్రతను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.