న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో తీవ్ర విషాదం (వీడియో)
AP: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం చింతల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం గండికోట వెళ్తుండగా స్కార్పియో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.