AP: పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు ఆ పింఛన్ డబ్బులు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒంటరి మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో కడియాల జనార్ధనరావు పక్షవాతంతో మంచం పట్టారు. ఆయనకు వచ్చే పింఛన్‌తోనే కుటుంబం గడిచేది. ఇటీవల ఆయన చనిపోగా, వెంటనే భార్య శేషకుమారికి పింఛన్ రావడంతో ఆమె సంతోషిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు చనిపోవడంతో భార్య ప్రశాంతికి పింఛన్ అందజేశారు.