న్యూ ఇయర్ సందర్భంగా టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కెర్లు కొట్టారు. ప్రస్తుతం భారత్ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెల్‌బోర్న్ నుంచి అనుష్కతో కలిసి విరాట్ సిడ్నీకి వచ్చేశాడు. కొత్త సంవత్సర వేడుకలకు హాజరయ్యాడు. ఇద్దరూ బ్లాక్ అవుట్‌ఫిట్‌తో సిడ్నీ వీధుల్లో కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.