రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?
AP: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనుంది. అయితే ఈ పథకాన్ని పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్‌ను రూ.6 వేల నుంచి కేంద్రం రూ.10 వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం కూడా అంత మొత్తంలో ఇవ్వనుంది.