ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. భయాందోళనలో స్థానికులు (వీడియో)

54చూసినవారు
గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోయంబత్తూరు శివారులో ఉప్పిలిపాళయం ఫ్లైఓవర్‌పై ఓ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ డ్యామేజ్ కావడంతో లిక్విడ్ గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో భారీ పేలుడు సంభవించే ప్రమాదముందని చుట్టుపక్కల వాళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో నీటి స్ప్రేయింగ్‌తో లీకేజీని నియంత్రించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్