పాకిస్థాన్‌కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు
పాక్ క్షిపణులతో మాకు ముప్పు వాటిల్లుతుందని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ పాకిస్థాన్‌కు చెందిన 4 కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశం దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోవడంపై వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాసియా దేశాలను దాటి లక్ష్యాలను ఛేదించగల వాటితో అమెరికాకు కూడా ముప్పేనని వ్యాఖ్యానించారు.