BREAKING: గ్యాస్ ట్యాంకర్లో మంటలు.. ఐదుగురి మృతి
రాజస్థాన్లోని జయపురలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగి ఐదుగురు మృతి చెందారు. 37 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. పెట్రోల్ బంక్ సమీపంలో ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.