పంచాయతీరాజ్ శాఖ నిధులు 17 కోట్లతో కందుకూరు మండల పరిధి నేదునూరు గ్రామంలో శనివారం ఉదయం 11. 45 గంటలకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని వైస్ ఎంపీపీ మాజీ సభ్యురాలు శమంత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ రానున్నారని తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.