హర్షసాయిపై మరో కేసు నమోదు
యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. బాధితురాలికి మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని అడ్వకేట్ తో కలిసి పీఎస్ కి వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న హర్షసాయిపై ఇప్పటికే అత్యాచార కేసు నమోదు అయింది. అతని కోసం నాలుగు పోలీస్ టీమ్ లు గాలిస్తున్నాయి.