విశాఖలో వివాహిత ఆత్మహత్య (వీడియో)
AP: కనుమ పండుగ వేళ విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఒంటికి నిప్పంటిచుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మీప్రసన్న అనే మహిళ భర్తతో విడిపోయి ఏడాదిగా దూరంగా ఉంటున్నారు. తన రెండేళ్ల కొడుకుతో కలిసి విశాఖలో నివాసముంటున్నారు. అయితే కొడుకును తన తల్లి ఇంట్లో ఉంచిన లక్ష్మీప్రసన్న.. ఇవాళ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కంచరపాలెం పోటీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.