మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కార్లు కొనేవారికి షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది. ఇక నుంచి పార్కింగ్ స్థలం ఉన్నవారికి మాత్రమే కార్లు అమ్మాలనే ఆదేశించింది. కారు కొనేప్పుడు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలు సమర్పించాలని పేర్కొంది. పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తున్నారని దీంతో ప్రమాదాలు, ఇబ్బందులు కలుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.