అత్యాచారం ఘటన.. నిందితుడిని పట్టిస్తే రూ.లక్ష రివార్డు ప్రకటన

65చూసినవారు
అత్యాచారం ఘటన.. నిందితుడిని పట్టిస్తే రూ.లక్ష రివార్డు ప్రకటన
మహారాష్ట్రలోని పూణేలో బస్సులోనే ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.  దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు దత్తాత్రయ రాందాస్‌గా గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశారు. అలాగే అతడిని పట్టిస్తే రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. నిందితుడి కోసం 13 బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే అతడిని పట్టుకుంటామని పూణే పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్