అమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా?

62చూసినవారు
అమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా?
కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్‌పై రాశారు. అమేథీ, గౌరీగంజ్‌లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు.