అల్లాదుర్గం నూతన కోర్టును ప్రారంభించనున్న హైకోర్టు జడ్జి
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో ఏర్పాటు కానున్న నూతన సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి విజయ సేనా రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఏడుపాయల నుండి ఉదయం 9: 50 నిమిషాలకు అల్లాదుర్గం చేరుకొని నూతన కోర్టు కాంప్లెక్స్ ను హైకోర్టు న్యాయమూర్తి ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలో కోర్టు సేవలు అందుబాటులోకి రానుండడంతో అల్లాదుర్గం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.