
వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు: హోంమంత్రి అనిత
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు. వంశీ అరెస్ట్ కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనిత సూచించారు. కాగా, గురువారం మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.