AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. బాధిత యువతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ విమర్శించారు.