సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాలనీలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణాన్ని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. కాలనీలోని ఒకచోట రోడ్డు వేయనందువలన వర్షపు నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు కార్పొరేటర్ కి తెలియజేయగా, కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.