కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది. ఈ కేసులో ఫిర్యాదుదారునిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గమనించాలని, అలాగే కేసుని దోపిడీకి సంబంధించిన అంశంగా పరిగణించట్లేదని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది.