అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు విద్యార్థులకు అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్‌లకు సోమవారం అవకాశం కల్పించింది. వేలాది మంది భారతీయులకు ఈ కొత్త స్లాట్లు దోహదం చేస్తాయని యూఎస్ ఎంబసీ పేర్కొంది. అంతేకాకుండా అమెరికా- భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. పది లక్షలకు పైగా వీసాలు జారీ చేశామని వెల్లడించింది.