VIDEO: అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చిన జవాన్
కొబ్బరికాయలు అమ్ముతున్న అమ్మకు ఓ జవాన్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. దేశ రక్షణ కోసం ఆర్మీలో పని చేస్తున్న ఓ యువకుడు తాజాగా సెలవులకు ఇంటికి వచ్చాడు. కానీ అతని రాక గురించి తల్లికి తెలియదు. నేరుగా కొబ్బరికాయ కావాలని అమ్మ దగ్గరకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలారోజుల తర్వాత కొడుకును చూసిన ఆ తల్లి భావోద్వేగానికి గురైంది. బిడ్డను హత్తుకుని ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.