

నార్త్ ఇండియన్స్ దక్షిణ భాషలు అర్ధం చేసుకోవాలి: పవన్ (వీడియో)
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'భారతదేశం విభజన రేఖలు లేకుండా మరింత ఐక్యంగా ఉండాలన్నారు. సాంస్కృతిక సమైక్యత కోసం, ఉత్తర భారతీయులు తెలుగు, కన్నడ, తమిళం వంటి దక్షిణాది రాష్ట్రాల భాషలను కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడి ప్రజలకు హిందీ ఇష్టం లేకపోతే వేరే భాష నేర్చుకోండి.ఇందులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అవి విభజనకు దారితీయకూడదు.' అని తెలిపారు.