నైటీ మాత్రమే వేసుకోవాలని భర్త టార్చర్

55చూసినవారు
నైటీ మాత్రమే వేసుకోవాలని భర్త టార్చర్
గుజరాత్ రాష్ట్రం అహ్మాదాబాబ్‌లోని జుహాపురాకు చెందిన 21 ఏళ్ల మహిళ వేజల్పూర్ పోలీసుల ముందు తన గోడు వినిపించింది. పెళ్లైనప్పటి నుంచి తనని నైటీలు మాత్రమే వేసుకోవాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వాపోయింది. వారు చెప్పినట్టు నైటీ వేసుకోకపోతే అసభ్యకర పదజాలంతో తిడుతున్నారని తెలిపింది. తిండి, నిద్ర విషయంలో కూడా ఆంక్షలు విధిస్తున్నారని.. తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత పోస్ట్