AP: విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో సదరు విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.