బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తెల్లరేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య తగ్గాలన్నారు. ఉచితాలు వద్దని.. తాము బతకగలమనే స్థాయిలో ప్రజల్లో మార్పు రావాలన్నారు. 77 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉందనే ప్రధాని మోదీ పీఎం విశ్వకర్మ లాంటి పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. విద్యానగర్‌లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సమావేశంలో పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తిచేసిన వారికి ఈటల సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు.