ఏపీలో వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ నోరు విప్పారు. 'జగన్ సీఎం అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఎంఓయూ జగన్ చేతితో రాసిందే. ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ వంద శాతం అందులో లేని ఎలహంక ప్రాపర్టీ వంద శాతం షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. కానీ అవి ఇవ్వకపోవడంతో పాపకు అన్యాయం జరిగింది' అని ఆవేదన వ్యక్తం చేశారు.