ఒంటరి అవుతుందేమోనని తల్లిని చంపేసి..

10257చూసినవారు
ఒంటరి అవుతుందేమోనని తల్లిని చంపేసి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డలో తుల్జాకుమారి పాసి(55) కుమారుడు వినయ్(27)తో నివాసం ఉంటున్నారు. 10ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. అయితే రెండేళ్లుగా తల్లికి ఆరోగ్యం బాగుండకపోవడం, ఆర్థిక సమస్యలతో వినయ్ మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల అతడికీ ఓ జబ్బు వచ్చింది. దీంతో ‘నాకు బతకాలని లేదు. నేను లేకపోతే అమ్మకు తోడెవరు?’ అని తనలో తాను మాట్లాడుకునేవాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి తల్లిని హత్య చేసి, తాను ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

సంబంధిత పోస్ట్