అమ్మాయిలు పెళ్లి వయస్సుకు రాగానే తల్లిదండ్రులు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వియత్నామ్ దేశంలోని యువతులు కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. సొసైటీ, పేరెంట్స్ ప్రెజర్ నుంచి బయటపడేందుకు కొద్దికాలం పాటు బాయ్‌ఫ్రెండ్స్‌ను అద్దెకు తీసుకుంటారట. తల్లిదండ్రులకు వారిని నిజమైన ప్రేమికులుగా పరిచయం చేసి తనకు పెళ్లి సంబంధాలు వెతకకుండా కొంతకాలం పాటు పెళ్లిని వాయిదా వేస్తున్నారట.