AP: కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయించిన షిప్‌లో బుధవారం మరోసారి తనిఖీలు జరుగుతున్నాయి. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు రేషన్ బియ్యం నమూనాలను సేకరిస్తున్నారు. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు.