హరిద్వార్‌లోని గంగా జలం తాగడానికి పనికి రాదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) తెలిపింది. నీటి నాణ్యత కేటగిరీ 'బి' స్థాయికి పడిపోయిందని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. భక్తులు స్నానానికి మాత్రమే ఆ నీటిని వినియోగించుకోవచ్చని సూచించింది. ప్రతి నెల 8 ప్రాంతాల్లో పీసీబీ నీటి పరీక్షలు నిర్వహిస్తోంది.