TG: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌లో ఆదివారం రాఘవేంద్ర కుమార్ అనే వ్యక్తి దోశ ఆర్డర్ చేసి, తింటుండగా బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింక రావడంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, దోశలో బొద్దింక వచ్చిన ఫోటోలు వైరల్‌గా మారాయి.